తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ సింగ్ కేసు: ఈరోజు అసలేం జరిగింది?

పలు మలుపులు తీసుకున్న నటుడు సుశాంత్ సింగ్ కేసును ఎట్టకేలకు సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు మొత్తం జరిగిన విషయాలు ఏంటంటే?

సుశాంత్ సింగ్ కేసు: ఈరోజు అసలేం జరిగింది?
సుశాంత్ సింగ్ కేసు

By

Published : Aug 19, 2020, 5:33 PM IST

  1. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసును కేంద్ర దర్యాప్తు బృందానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు 19) కీలక తీర్పునిచ్చింది.
  2. ఇప్పటివరకు సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐకి అందజేయాలని మహారాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
  3. అవసరమనుకుంటే కొత్తగా కేసు ఫైల్ చేసేందుకు సీబీఐ అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సహకరించాలని ఆదేశించింది.
  4. సీబీఐ దర్యాప్తు కోరే అర్హత బిహార్ ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది.
  5. రియా చక్రవర్తిపై వేసిన కేసు విషయమై ఇరువర్గాలు మూడు రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి దర్యాప్తును వారం పాటు వాయిదా వేసింది.
  6. కేసును సీబీఐకి అప్పగించడంపై స్పందించిన సుశాంత్ కుటుంబం.. స్నేహితులు, శ్రేయోభిలాషులు, మీడియా, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిందితులకు శిక్ష పడుతుందని, న్యాయం బయటకొస్తుందని ప్రకటన విడుదల చేసింది.
  7. ఇదే విషయమై స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ వరప్రసాద్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్రమంత్రి ఆర్​కే సింగ్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
  8. బాలీవుడ్​ ప్రముఖులు కూడా ఈ అంశంపై ట్వీట్లు చేశారు. సీబీఐకి అప్పగించడం సరైనదేనని, న్యాయం గెలుస్తుందని రాసుకొచ్చారు. వీరిలో అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, అంకిత లోఖండే, శేఖర్ సుమన్ తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details