ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం ఎదురైంది. లుఫ్తాన్సా విమానంలో దిల్లీకి చేరుకున్న జక్కన్నకు అక్కడి పరిస్థితులు నచ్చలేదట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసిన రాజమౌళి.. దిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
"డియర్ దిల్లీ ఎయిర్పోర్ట్. లుఫ్తాన్సా విమానంలో రాత్రి ఒంటి గంటకి దిల్లీ ఎయిర్పోర్టు చేరుకున్నా. ఆర్టీ పీసీఆర్ టెస్టు కోసం అప్లికేషన్ నింపమని ఇచ్చారు. కొందరు ప్రయాణికులు కింద కూర్చుని దరఖాస్తు ఫారం నింపుతుంటే మరికొందరు గోడకు ఫారం పెట్టుకుని నింపుతున్నారు. ఇందుకోసం కనీసం టేబుల్స్ కూడా వేయలేదు. అలాగే ఎగ్జిట్ గేట్ బయట వీధి కుక్కలు చాలా ఉన్నాయి. ఇది విదేశీ ప్రయాణికులపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యలపై దృష్టి సారించండి. ధన్యవాదాలు."