తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి కానుకగా రాజమౌళి 'ఆర్ ​ఆర్​ ఆర్​'..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​' 2021లో సంక్రాంతి కానుకగా రానుందట. ముందుగా అనుకున్నట్లు వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నా... కొన్ని కారణాల వల్ల ఆలస్యం కానుందని సమాచారం.

సంక్రాంతి కానుకగా రాజమౌళి 'ఆర్ ​ఆర్​ ఆర్​'..?

By

Published : Oct 16, 2019, 1:02 PM IST

Updated : Oct 16, 2019, 1:11 PM IST

'ఆర్‌ ఆర్‌ ఆర్‌' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అగ్ర కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడం వల్ల 'ఆర్‌ ఆర్‌ ఆర్'పై భారీ అంచనాలున్నాయి. తాజాగా సినిమా విడుదల తేదీ మారే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది జులైలో తీసుకురావాలని చిత్రబృందం భావించినా... ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదని సినీ వర్గాల సమాచారం. దీని ప్రకారం 2021 జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుందని సమాచారం.

ఇదే కారణమా..?

ఆది నుంచే ఎన్నో అవాంతరాలతోనే కొనసాగుతోంది జక్కన్న ప్రాజెక్టు. ఒకానొక సమయంలో ఇద్దరు హీరోలూ గాయల పాలయ్యారు. ఇందులో నటిస్తోన్న ఆలియా భట్​ కూడా అనారోగ్యం పాలైంది. వీరితో పాటు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు బాలీవుడ్​ స్టార్ నటుడు​ అజయ్​ దేవగణ్. వీళ్లందరి డేట్లు సరిగా కుదరకపోవడం చిత్రబృందానికి ఇబ్బందిగా తయారైందట. సినిమాలో బాహుబలికి మించి యాక్షన్​ సన్నివేశాలనూ తీర్చిదిద్దే ఆలోచన ఉన్నాడట దర్శకధీరుడు. ఇవే ఆలస్యానికి కారణాలుగా తెలుస్తోంది.

" సినిమాలో రాజమౌళి మరిన్ని యాక్షన్​ సీన్లు పెట్టాలని అనుకుంటున్నారు. ఇందులో చేసే స్టంట్లు ఇప్పటివరకు చరణ్​, తారక్, అజయ్​ దేవగణ్​​ ఏ చిత్రంలోనూ చేయలేదు. బాహుబలికి మించి ఇందులో అద్భుతాలు చూస్తారు".
-- సినీ వర్గాలు

టైటిల్​ కూడా తేలలేదు..!

'ఆర్‌ ఆర్‌ ఆర్‌' అనే పొడి అక్షరాల్ని ప్రతిబింబించే టైటిల్‌ పెట్టమని ఇదివరకే అభిమానుల్ని కోరాడురాజమౌళి. ఆ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వందలాది టైటిళ్లు చక్కర్లు కొట్టాయి. అందులో ఓ పేరుని చిత్రబృందం ఖరారు చేసిందని సమాచారం. ఈ చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అనే పేరు బాగుంటుందని అనుకుంటున్నారట. మిగిలిన భాషల్లో 'రైజ్‌ రివోల్ట్‌ రివెంజ్‌' పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ టైటిల్‌కి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Last Updated : Oct 16, 2019, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details