ప్రస్తుతం టాలీవుడ్లో వైవిధ్య కథలకు పెద్ద పీట వేస్తున్నారు యువ హీరోలు. దర్శకుల జయాపజయాలను లెక్కలోకి తీసుకోకుండా కథ నచ్చితే చాలు వారితో కలిసి పని చేసేందుకు సై అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యువ హీరో చేరనున్నాడు. 'అల్లుడు శ్రీను' ఫేమ్ బెల్లంకొండ శ్రీనివాస్.. ఓ అగ్రదర్శకుడితో పనిచేయనున్నాడని తెలుస్తోంది. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో డీలాపడ్డ శ్రీను వైట్లకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడని సమాచారం.
బెల్లంకొండ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే ఓ పవర్ఫుల్ యాక్షన్ కథను చెప్పాడట శ్రీను వైట్ల. అది అల్లుడు శ్రీనుకి కూడా బాగా నచ్చి ఈ కొత్త ప్రాజెక్టుకు సై అన్నట్లు చిత్రసీమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, వచ్చే ఏడాది ద్వితియార్ధం నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.