తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొమాన్స్‌కి కేథరిన్‌.. పోరుకి శ్రీకాంత్‌..! - srikanth

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్​గా కేథరిన్​ను, విలన్​గా ఓ సీనియర్​ హీరోను తీసుకోవాలని ప్రయత్నిస్తోందట చిత్రబృందం.

srikanth
బాలయ్య

By

Published : Dec 14, 2019, 5:42 PM IST

నందమూరి హీరో బాలకృష్ణకు జోడీగా యువ కథానాయిక కేథరిన్‌ థెరిసా నటించబోతుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఇందులోనే కేథరిన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ కథలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో మొదటి కథానాయికగా బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా పేరు వినిపించింది. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే రెండో కథానాయిక కేథరిన్‌ అంటూ ప్రచారం ఊపందుకుంది.

ఇక ప్రతినాయకుడి విషయానికొస్తే.. ఈ చిత్రం కోసం బోయపాటి మరో కథానాయకుడిని విలన్‌గా మార్చబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ ఈ సినిమాలో బాలయ్యతో తలపడేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధాన విలన్‌గా కనిపించబోయేది మాత్రం బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌ను మరో ముఖ్య ప్రతినాయక పాత్ర కోసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట బోయపాటి.

గతంలో అల్లు అర్జున్‌తో బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు' చిత్రంలో కనిపించింది కేథరిన్‌. బోయపాటి మరో చిత్రం 'జయ జానకి నాయక'లోనూ ప్రత్యేక గీతంలో నర్తించింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో 'వరల్డ్ ఫేమస్‌ లవర్‌'లో నటిస్తోంది.

ఇవీ చూడండి.. పుట్టినరోజున 'పార్ట్నర్​'కి 'క్లాప్‌' కొట్టిన ఆది

ABOUT THE AUTHOR

...view details