తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా పనితనం మెచ్చి రామ్​చరణే ఆఫర్ ఇచ్చాడు: సుస్మిత - ramcharan

'సైరా: నరసింహారెడ్డి' సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్ చేయమని రామ్​చరణే ఆఫర్ ఇచ్చాడని చెప్పింది సుస్మిత కొణిదెల. ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, తమన్నాకూ తానే దుస్తులు రూపొందించానని తెలిపింది.

సుస్మిత కొణిదెల

By

Published : Sep 28, 2019, 3:30 PM IST

Updated : Oct 2, 2019, 8:47 AM IST

సుస్మిత కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా: నరసింహారెడ్డి.' ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్​గా పనిచేసింది చిరు కుమార్తె సుస్మిత కొణిదెల. 'రంగస్థలం'లో తన పనితనం మెచ్చి రామ్​చరణే ఈ ఆఫర్ ఇచ్చాడని చెప్పింది. అమితాబ్, నయనతార, తమన్నాకూ తానే దుస్తులు డిజైన్ చేశాని చెప్పుకొచ్చింది సుస్మిత.

ఈ సినిమా కోసం చెన్నై నుంచి హైదరాబాద్​కు మకాం మార్చింది సుస్మిత. 'ఖైదీ నెంబర్ 150', 'రంగస్థలం' చిత్రాల్లో కాస్ట్యూమ్స్​ డిజైన్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.

అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్​ సేతుపతి, సుదీప్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: టీజర్​: ఆకట్టుకుంటున్న 3 మంకీస్.. కామెడీ జబర్దస్త్

Last Updated : Oct 2, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details