మీ న్యూలుక్ బాగుంది.. కొత్త సినిమా కోసం లుక్ మార్చారా?
సుశాంత్: నా న్యూ లుక్ గురించి మీరు ఇస్తున్న ప్రశంసలకు ధన్యవాదాలు. తర్వాత చిత్రం కోసమైతే కాదు కానీ ఒక చిన్న సన్నివేశం కోసం ఇలా లుక్ మార్చా.
త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
సుశాంత్: ఆయనతో కలిసి పనిచేయడం ఓ అద్భుతం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నేనేంటో నాకు బాగా తెలిసింది. 'అల..వైకుంఠపురములో..' చిత్రం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయగలనో అర్థమైంది.
'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' కాన్సెప్ట్ ఏమై ఉంటుంది?
సుశాంత్: ఆ సినిమా మోషన్ పోస్టర్ చూస్తే మీకో ఐడియా రావొచ్చు.
'అల..వైకుంఠపురములో..' చిత్రంలో మీరు రెండో కథానాయకుడా? లేక మూడో కథానాయకుడా?
సుశాంత్: నిజం చెప్పాలంటే ఎంతో టాలెంట్ ఉన్న నటీనటులతో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే నా పాత్రను నేను ఇష్టపడి చేశా. ఈ సినిమాకి రెండు, మూడు అని లెక్కలేసుకోలేదు.
'అల..వైకుంఠపురములో..' మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
సుశాంత్: ఎప్పుడూ చేసే పాత్రలకు కొంతవరకూ బ్రేక్ తీసుకుని, ఎవరూ ఉహించని పాత్రల్లో నటించాలనుకున్నా. 'అల..వైకుంఠపురములో..' త్రివిక్రమ్ - అల్లుఅర్జున్ సినిమా అయినప్పటికీ ప్రతిఒక్కరి పాత్ర కీలకంగా ఉండనుంది.
అక్కినేని అన్నపూర్ణమ్మ గురించి ఏమైనా..?
సుశాంత్: ఆమె ఎప్పటికీ మాతోనే ఉంటుంది.
నటుడు కాకపోతే ఎలాంటి వృత్తిని స్వీకరించేవారు?
సుశాంత్: నటుడిని కాకముందు నేను ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్.
మీకు ఇష్టమైన పాట, పుస్తకం, సినిమా?
సుశాంత్: నేను పుస్తకాలు ఎక్కువగా చదవను. చిన్నప్పుడు కామిక్స్ చదివేవాడిని. 2020లో పుస్తకాలు చదవాలనే గోల్ పెట్టుకున్నా. పుస్తకాలు చదవడం వల్ల ఉహాతీతం, వాస్తవికత గురించి తెలుస్తుంది.
మీరు థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని భావిస్తున్నా?
సుశాంత్: నేను తదుపరి నటించబోయే చిత్రం 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' థ్రిల్లర్ సినిమానే. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ సమానంగా ఉన్న చిత్రమిది. థ్రిల్లర్ జోనర్‌లో ఇదే నా మొదటి చిత్రం.
ఏదైనా స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వండి?
సుశాంత్: నేను ఎప్పటికీ నమ్మేది ఒక్కే ఒక్క సందేశం. అదే 'బతుకు.. బతికించు'.
'అల..వైకుంఠపురములో..' చిత్రం గురించి ఏమైనా చెప్పగలరా?
సుశాంత్: ఈ సినిమాలో బన్నీతో కలిసి నటించడం అద్భుతంగా ఉంది. అంతేకాదు ఒక ప్రేక్షకుడిగా ఆయన చేసిన ప్రతి సన్నివేశాన్ని నేను ఎంజాయ్ చేశా. ఈ సినిమా గురించి ప్రస్తుతానికి బయటపెట్టలేను.
అక్కినేని కుటుంబంలో మీతో బాగా ఉండేది ఎవరు?
సుశాంత్: వయసు భేదం లేకుండా మేమందరం చాలా సరదాగా ఉంటాం. మేమందరం చాలా తక్కువసార్లు కలుస్తాం. కానీ కలిస్తే మాత్రం ఆరోజు పండగే.