"నా పిల్లల ఎదుగుదలను చూడలేకపోయానని బాధగా ఉంది" అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటే తన జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనల్ని పంచుకున్నారు.
"నా పిల్లలు పెరిగే వయసులో, వారితో ఉండలేకపోయాను. 49 ఏళ్ల కెరీర్లో(2015లో మాట్లాడతూ) రోజుకు సరాసరి 11 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో చరణ్, పల్లవిల ఎదుగుదల చూడలేకపోయాను. సంప్రదాయ సంగీతం నేర్చుకోలేకపోయాను. ఇంజినీరింగ్ డిగ్రీ సగంలోనే వదిలేశాననే బాధగా ఉండేది" -ఎస్పీ బాలు, ప్రముఖ గాయకుడు
1966లో 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' సినిమాతో గాయకుడిగా కెరీర్ ప్రారంభించారు బాలు. తనకు ప్రతిరోజూ మలుపులేనని, అంకిత భావంతో ఉండటం వల్లే ఇన్నేళ్ల పాటు కొనసాగగలిగానని అన్నారు.