అమృతతుల్య గాత్రంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం(74) కన్నుముశారు. దేశవ్యాప్తంగా అశేష అభిమానులకు వేలాది పాటలను, అద్భుతమైన తన గానాన్ని గుర్తులుగా మిగిల్చి దివికేగారు.
ఆగస్టు 5న ఎంజీఎం ఆసుత్రిలో చేరారు బాలు. జలుబు, జ్వరంగా ఉండటం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ సోకినట్లు తేలింది. దీంతో స్వయంగా వీడియోను విడుదల చేశారు. ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు.
తర్వాత కొద్ది రోజులకే పరిస్థితి విషమం కావడం వల్ల ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన ఆయన కుమారుడు ఎస్పీ చరణ్.. తండ్రి కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. తర్వాత పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వెంటిలేటర్ సహా ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.
బాలు కోలుకోవాలని సినీదిగ్గజాలు పిలుపునివ్వడం వల్ల ఆగస్టు 20న సాయంత్రం 6 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రార్థనలు నిర్వహించారు. బాలు పాడిన పాటలు ఆలపించి ఆయన కోలుకోవాలని అభిలాషించారు. తర్వాత బాలుకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.
సెప్టెంబరు 7న చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు చరణ్ ప్రకటించారు. నాన్న క్రమంగా కోలుకుంటున్నారని, కూర్చోగలుగుతున్నారని చెప్పారు. త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈనెల 24న