దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్స కొనసాగిస్తున్నామని... ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి తెలిపింది. కరోనాతో ఆగస్ట్ 5 వతేదీన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన కొన్నిరోజులకు కరోనా తీవ్రం కావడంతో ఆయనకు ఎక్మో ( ఎక్సట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజన్ ) ద్వారా లైఫ్ సపోర్టు అందించారు. ఆ తర్వాత కరోనా తగ్గినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. గడచిన కొన్నిరోజులుగా బాలు ఆరోగ్యం కాస్త మెరుగవుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ చెబుతూ వస్తున్నారు. దీంతో బాలు కోలుకుంటారని అభిమానులు ఆశించారు. అయితే కరోనా తగ్గినా... ఇతర అనారోగ్య సమస్యల వల్ల ఆయన పరిస్థితి విషమించిందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించింది.
హెల్త్ బులెటిన్: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం - ఎస్పీ బాలు ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించింది. తీవ్ర అనారోగ్యంతో కొన్నాళ్లుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని వైద్యులు వెల్లడించారు.
sp balu
"ఆగస్టు 5న కొవిడ్ బారినపడి ఎంజీఎంలో చేరిన బాలు ఇంకా ఎక్మో సహాయంతో వెంటిలేటర్‌పైనే చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటలుగాబాలు ఆరోగ్యం మరింత క్షీణించింది.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఆయన్ను పర్యవేక్షిస్తోంది" -ఎంజీఎం ఆస్పత్రి ప్రకటన
Last Updated : Sep 24, 2020, 11:31 PM IST