ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల - sp balu health bulliten
సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన వైద్యులు.. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. సోమవారానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
గాయకుడు ఎస్పీ బాలు
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్యంపై సోమవారం హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఎక్మో సహాయంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు, ఫిజియోథెరపీకి స్పందిస్తున్నారని తెలిపారు. బాలు ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఆగస్టు 5న కరోనా బారిన పడి చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్ప్రత్రిలో చేరారు బాలు.