'దివినుంచి భూమికి దిగివచ్చిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం' అని ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో యువ కళావాహిని, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వ విఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గాయని కౌసల్యకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదిన పురస్కారం ప్రదానం చేశారు.
కౌసల్యకు 'ఎస్పీ బాలు జన్మదిన పురస్కారం' - బాలసుబ్రహ్మణ్యం
సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా యువ కళావాహిని, శృతి లయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గాయని కౌసల్యకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జన్మదిన పురస్కారాన్ని ప్రదానం చేశారు.
గాయని కౌసల్యకు బాలసుబ్రహ్మణ్యం జన్మదిన పురస్కారం
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి జమున, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, కళ పత్రిక సంపాదకులు మహమ్మద్‌రఫీ పాల్గొని కౌసల్యను సత్కరించారు.