తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వినూత్నంగా 'ఆకాశం నీ హద్దురా' పాట విడుదల - సూరరై పోట్రు

ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య హీరోగా, 'గురు' ఫేమ్​ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం 'సూరరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సాంగ్​ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాట విడుదల కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించింది చిత్రబృందం.

Soorarai Pottru
100 మంది చిన్నారులతో సూర్య విమాన ప్రయాణం

By

Published : Feb 13, 2020, 3:25 PM IST

Updated : Mar 1, 2020, 5:30 AM IST

ప్రముఖ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'సూరరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా'గా విడుదల కానుంది. ఎయిర్​ దక్కన్​ కెప్టెన్​ గోపీనాథ్​ జీవితాధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి 'పిల్లా పులి' అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం. ఇందుకోసం వినూత్న ప్రచారాన్ని ఎంచుకుంది. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది పిల్లలకు మొదటిసారి విమాన ప్రయాణ అనుభూతిని అందించింది. వారందరి సమక్షంలోనే విమానం గాల్లో ఉండగా పాటను విడుదల చేశారు. దీనికి సూర్యతో సహా చిత్రబృందం హాజరైంది.

ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 'గురు' ఫేమ్​ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకురాలు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అపర్ణ బాలమురలి కథానాయిక. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న తదితరులు మరిన్ని పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Last Updated : Mar 1, 2020, 5:30 AM IST

ABOUT THE AUTHOR

...view details