తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క మిస్డ్ కాల్.. ఆక్సిజన్​ అందిస్తాం: సోనూసూద్ - sonusood news

ఆక్సిజన్​ దొరక్క ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితుల కోసం సోనూసూద్​ మరో ముందడుగు వేశారు. మిస్డ్​ కాల్ చేస్తే, ఆక్సిజన్​ను ఉచితంగా అందిస్తామని ఓ నంబర్​ను పంచుకున్నారు.

sonu sood oxygen toll free number
సోనూసూద్

By

Published : May 15, 2021, 8:10 PM IST

కరోనా జనాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు చాలామంది ఆక్సిజన్‌ దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే.. మీకు ఆక్సిజన్‌ ఇస్తా అంటున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్‌. కరోనా తెచ్చిన కష్టకాలంలో హీరోగా నిలబడి ఎందరినో ఆదుకుంటున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్‌ కోసం ఎదురుచూస్తూ వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌తో పాటు పలుదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. దిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ కావాల్సిన వాళ్లు తనను సంప్రదించాలని ఆయన చెప్పారు.

'దిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కువ సంఖ్యలో జనం కరోనాతో పోరాడుతున్నారు. అందులో చాలామందికి ఆక్సిజన్‌ అందించాల్సి ఉంది. అందుకే వారికి ఆక్సిజన్‌ అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ అవసరం ఉన్నవాళ్లు ఈ నంబర్​కు(022-61403615) మిస్డ్‌కాల్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తాం' అని సోనూ అన్నారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు వచ్చేస్తున్నాయి. దిల్లీలో మరిన్ని ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details