తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వలస కూలీల కోసం టోల్​ ఫ్రీ నెంబర్​ : సోనూసూద్​

లాక్​డౌన్​తో ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను.. తమ ఇళ్లకు చేర్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్​. ఇప్పటికే బస్సులను ఏర్పాటు చేసిన ఆయన.. వారి కోసం తాజాగా టోల్​ ఫ్రీ నెంబర్​ను ప్రారంభించారు.

sonu sudh
సోనూ సూద్​

By

Published : May 26, 2020, 4:15 PM IST

కరోనాపై పోరుకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎవరి శైలిలో వారు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు సోనూసూద్​ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. లాక్​డౌన్​ వేళ ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. స్వయంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడి, అనుమతులు పొందిన తర్వాత.. కార్మికుల్ని జాగ్రత్తగా ఇళ్లకి పంపిస్తున్నారు. తాజాగా కార్మికులు సంప్రదించేందుకు వీలుగా టోల్​ ఫ్రీ నెంబర్​నూ ప్రారంభించారు. తమ సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు 18001213711కు కాల్‌ చేయాలని కోరారు సోనూసూద్.

"నాకు ప్రతిరోజు వేల కొద్ది కాల్స్​ వస్తున్నాయి. నా కుటంబం, స్నేహితులు వలస కార్మికుల డేటాను సేకరించి వారిని తమ ఇళ్లకు చేర్చే పనిలో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కొంతమందిని మేము సంప్రదించలేకపోవచ్చు. కాబట్టి టోల్​ ఫ్రీ నెంబర్​ను ప్రారంభించాలని నిర్ణయించాం. దయచేసి ఎవరైతే ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారో నాకు తెలియజేయండి. మీరు ఎ‍క్కడ ఉన్నారో, ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారో చెప్పండి. నేను, నా బృందం మిమ్మల్ని స్వస్థలాలకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం"

-సోనూసూద్​, నటుడు.

ఇప్పటికే కొవిడ్‌-19పై పోరాటంలో కీలకంగా పనిచేస్తున్న వైద్యసిబ్బంది.. తన హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు సోనూసూద్. ఆ తర్వాత మురికివాడల్లో నివసిస్తున్న పేదలకి ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే వలస కూలీల్ని ఇళ్లకి చేర్చడం కోసం బస్సులు ఏర్పాటు చేశారు.

సోనూ సాయంతో ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకకి చెందిన వేలాది మంది వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకున్నారు. రెండు నెలలుగా తన స్నేహితులతో కలిసి ఆయన చేస్తున్న సహాయ కార్యక్రమాలపై.. సామాన్యులు, సినీ రాజకీయ ప్రముఖలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి : విలన్ కాదు అతడు రియల్​ హీరో

ఇదీ చూడండి : మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా: స్మృతి ఇరానీ

ABOUT THE AUTHOR

...view details