తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగార్జున 'బంగార్రాజు'లో సోనాక్షి సిన్హా! - నాగార్జున, సోనాక్షి సిన్హా

అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయనా' బ్లాక్​బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్​గా 'బంగార్రాజు'ను ఇప్పటికే ప్రకటించారు. జులైలో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో హీరోయిన్​గా సోనాక్షి సిన్హాను ఎంపిక చేసే పనిలో పడిందట చిత్రబృందం.

Nagarjuna, Sonakshi Sinha
నాగార్జున, సోనాక్షి

By

Published : May 8, 2021, 8:51 AM IST

'మన్మథుడు' నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు - రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్​గా 'బంగార్రాజు'ను తెరకెక్కించనున్నారు. సినిమా షూటింగ్‌ జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సోనాక్షి సిన్హా

ఇందులో కథానాయికగా బాలీవుడ్‌నటి సోనాక్షి సిన్హా నటించనున్నట్లు సమాచారం. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్‌. ఇందులో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారట. సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది.

ఈ మధ్యే విడుదలైన 'వైల్డ్‌డాగ్‌' సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారికాగా నటించి అలరించారు. సినిమా ఓటీటీలోనూ వచ్చేసింది. ప్రస్తుతం ప్రవీణ్‌సత్తార్‌ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమం పూర్తిచేసుకొంది. ఇక బాలీవుడ్‌లో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్‌ జంటగా నటిస్తున్న 'బ్రహ్మస్త్ర'లో విష్ణు పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details