బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. తన కల నెరవేర్చుకుంది. ముంబయి బాంద్రాలో సొంతింటిని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
"నేను నటించడం మొదలుపెట్టినప్పుడే సొంతిల్లు కొనుక్కోవాలని అనుకున్నా. అదీ నా 30 ఏళ్లలోపే జరగాలని తీర్మానించుకున్నాను. నేను డెడ్లైన్ దాటొచ్చు కానీ నా కల మాత్రం నెరవేరింది" అని నవ్వుతూ చెప్పింది సోనాక్షి.