తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమా చేయనందుకు బాధపడ్డ స్నేహ - ప్రియమైన నీకు నటీమణి ముచ్చట్లు

'చంద్రముఖి' సినిమాలో నటించలేకపోయినందుకు చాలా బాధపడ్డానని చెప్పిన స్నేహ.. 'శ్రీరామదాసు' చేస్తున్న సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు చాలా ధైర్యం చెప్పారని తెలిపింది. వీటితో పాటే చాలా విషయాల్ని పంచుకుంది.

Alitho Saradaga_Sneha
'చంద్రముఖి'లో చేయనందుకు బాధపడ్డ స్నేహ

By

Published : Nov 8, 2020, 5:08 PM IST

'ప్రియమైన నీకు' సినిమాతో తెరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి స్నేహ.. 'శ్రీరామదాసు', 'వెంకీ'తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షో కు గతంలో హాజరైనప్పుడు తన జీవితానికి సంబంధించిన చాలా ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

జ్యోతిక పాత్ర నేను చేయాల్సింది

ఈ సినిమాలో మీరు హీరోయిన్ అయితే బాగుండు అని అనిపించిన సినిమా ఏది? అని అలీ అడగ్గా... 'చంద్రముఖి' అని బదుల్చిచంది స్నేహ. "ఆ సినిమాలో జ్యోతిక పాత్ర ముందు నాకే వచ్చింది. వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రం చేయలేకపోయాను. అప్పుడప్పుడు ఈ విషయం గుర్తొస్తే బాధేస్తుంది" అని స్నేహ తెలిపింది.

దర్శకుడు రాఘవేంద్ర వల్లే...

ఈ పాత్ర చేయడం చాలా కష్టమనిపించిన సినిమా ఏదైనా ఉందా? అని అలీ స్నేహను అడిగారు. 'శ్రీరామదాసు' సినిమా అని ఆమె గుర్తుచేసుకుంది. " ఆ పాత్ర చెయ్యలేకపోయానని కాదు. కానీ, అందులో చాలా బాధ్యతతో నటించాలి. ప్రేక్షకులను మెప్పించాలి. ఆ సమయంలో నేను చాలా చిన్న అమ్మాయిని. దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చిన ధైర్యం వల్లే ఆ పాత్ర చేయగలిగాను" అని స్నేహ చెప్పింది. తన ప్రేమ వివాహం గురించి, చిన్ననాటి విషయాల గురించి మరిన్ని కబుర్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details