తెలుగు స్టార్హీరో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోగా 26 సినిమాలు(mahesh babu movies) చేసిన మహేశ్.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట'లో(mahesh babu new movie) నటిస్తున్నారు. అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుతో పాటు ఎనిమిది నంది అవార్డులు ఆయనను వరించాయి. ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థనూ స్థాపించారు. అయితే ఇలా ఎన్నో విషయాలు మనకు తెలిసినప్పటికీ మహేశ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే?
ప్రిన్స్ గురించి నమ్మలేని నిజాలు మీకోసం..
కార్తీ, విజయ్‌లు స్నేహితులు..
తమిళ ప్రముఖ నటుడు కార్తీ.. మహేశ్‌బాబుకు స్కూల్‌మేట్. తమిళ సూపర్‌స్టార్ విజయ్ చిన్ననాటి స్నేహితుడు.
అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సినిమాలు..
మహేశ్‌బాబు సినిమాలకు టెలివిజన్‌లో అత్యధిక రేటింగ్ ఉంది. బాలీవుడ్‌లోనూ ఈయన సినిమాలకు(mahesh babu movies list) మంచి క్రేజ్ ఉంది.
బాలీవుడ్‌లోకి డబ్ అయిన సినిమాలు