తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోలో జీవితమే బాగుందంటున్న మెగాహీరో - సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా

మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు హీరో సాయిధరమ్ తేజ్. దసరా పండుగ సందర్భంగా టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు.

సోలో లైఫ్ బెటర్ అంటున్న మెగాహీరో

By

Published : Oct 7, 2019, 9:13 AM IST

Updated : Oct 7, 2019, 9:21 AM IST

మెగాహీరో సాయిధరమ్ తేజ్​ 'ప్రతిరోజూ పండగే' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇంతలోనే మరొకటి మొదలుపెట్టేశాడు. ఈ చిత్రానికి 'సోలో బ్రతుకే సో బెటర్​' అనే విభిన్న టైటిల్​ పెడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్​ను పంచుకున్నాడీ కథానాయకుడు.

"కేర్​ఫుల్​ బ్రదర్స్​ అండ్ సిస్టర్స్.. ఎందుకంటే #సోలో బ్రతుకే సో బెటర్" -ట్విట్టర్​లో సాయిధరమ్ తేజ్

హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్

ఇందులో నభా నటేశ్​ హీరోయిన్​గా నటించనుంది. తమన్ సంగీతమందించనున్నాడు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బీవీఎస్​ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

పూజా కార్యక్రమంలో చిత్రబృందం
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా

ఇది చదవండి: 'నట జీవితంలో నిలబడాలంటే... అలా మారాల్సిందే'

Last Updated : Oct 7, 2019, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details