తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో 'సోలో బ్రతుకే సో బెటర్' - ramoji film city shootings

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లపై పాటను చిత్రీకరించారు.

రామోజీ ఫిల్మ్​సిటీలో 'సోలో బ్రతుకే సో బెటర్'
సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్

By

Published : Aug 31, 2020, 9:00 PM IST

ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటకు నృత్య రీతులు సమకూర్చుతున్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో ప్రతి ఒక్కరూ మాస్క్​లు ధరించి కనిపించారు. హీరోహీరోయిన్ల వ్యక్తిగత సిబ్బంది పీపీఈ కిట్లలో దర్శనమిచ్చారు.

ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పూర్తి జాగ్రత్తలతో షూటింగ్​లు జరుగుతున్నాయి. ఔట్​డోర్ కంటే స్టూడియోల్లోనే చిత్రీకరణ జరిపేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details