తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నో పెళ్లి' అంటున్న టాలీవుడ్​ టాప్​ సింగర్స్​ - Solo Brathuke So Better movie of No Pelli Cover Version Song

సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలె ఈ సినిమా నుంచి 'నో పెళ్లి' అనే పాటను విడుదలైె.. అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా కోసం కవర్​ వెర్షన్​ పాడింది టాలీవుడ్​ గాయనీగాయకుల బృందం.

No Pelli Cover Version Song
సెల్ఫీ వీడియోతోనే 'నో పెళ్లి' కవర్​ వెర్షన్​ సిద్ధం..

By

Published : Jun 7, 2020, 2:31 PM IST

ఎన్నో సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్‌ సింగర్స్‌ ప్రస్తుతం 'నో పెళ్లి' అంటున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రంలోని ఓ పాటకు వీరందరూ కవర్‌ వెర్షన్‌ రూపొందించారు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల అర్మాన్‌ మాలిక్‌ పాడిన 'నో పెళ్లి' పాటను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఆ పాటకు కవర్‌ వెర్షన్‌లో రమ్య బెహరా, మనీషా ఎర్రబాతిని, రేవంత్‌, కృష్ణ చైతన్య, ధనుంజయ్‌, శ్రీరామచంద్ర, లిప్సిక, ధామిని, గీతామాధురి, దీపు, రోల్‌ రైడా.. ఇలా గాయనీ గాయకులందరూ కలిసి మెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

గతేడాది విడుదలైన 'ప్రతిరోజూ పండగే' చిత్రం తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్‌'. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. నభానటేశ్‌ కథానాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది.

ఇదీ చూడండి: లిప్​లాక్​తో నటి సుస్మితాసేన్​ రీఎంట్రీ..!

ABOUT THE AUTHOR

...view details