సూపర్ స్టార్ రజనీకాంత్..ఏ ఆర్ మురుగదాస్‌తో తొలిసారిగా పనిచేయనున్నాడు. ఈనెల 10న ముంబయిలో షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రంలో రజనీ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.జె.సూర్య విలన్‌గా నటించనున్నట్లు సమాచారం.
రజనీకి విలన్‌గా 'ఖుషీ' దర్శకుడు - రజనీకాంత్
నటుడు, దర్శకుడు ఎస్.జె.సూర్య...రజనీకాంత్ కొత్త సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనున్నాడు.
రజనీకాంత్ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఎస్.జె.సూర్య
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. నయనతార హీరోయిన్గా కనిపించనుంది.
ఎస్.జె.సూర్య..నటుడుగానే కాకుండా దర్శుకుడుగానూ ఎన్నో సూపర్ హిట్లు రూపొందించాడు. టాలీవుడ్ హీరోలు మహేశ్‌బాబుతో 'నాని', పవన్ కల్యాణ్‌తో 'ఖుషి', 'కొమరం పలి' సినిమాలు తీశాడు. మహేశ్ 'స్పైడర్'లో విలన్‌గానూ ఆకట్టుకున్నాడు.