ప్రియమణి ప్రధానపాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'సిరివెన్నెల.' మహానటిలో బాల సావిత్రిగా మెప్పించిన సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. ఏ.ఎన్ బాషా, రామసీత నిర్మాతలుగా వ్యవహిస్తోన్న ఈ సినిమాకు ప్రకాశ్ పులిజాల దర్శకుడు.
ట్రైలర్: భయపెడుతోన్న 'సిరివెన్నెల' - sirivennela
ప్రియమణి, సాయి తేజస్విని ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'సిరివెన్నెల.' తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
సిరివెన్నెల
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. 'బాహుబలి' ఫేమ్ కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. పూరీ ఇంక సెలవు తీసుకుంటాడట..