ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్ 'ఆర్‌ఆర్‌ఆర్'. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చేరువలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్‌ని చిత్రబృందం భారీగా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా దేశంలోనే పేరుపొందిన ఐదుగురు యువ సంగీత కెరటాలతో స్నేహగీతాన్ని క్రియేట్ చేయించింది.
'దోస్తీ' అంటూ సాగే ఈ పాటను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం (ఆగస్టు 1) చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో 'దోస్తీ' పాటను ఆలపించిన హేమచంద్ర, అనిరుధ్, అమిత్ త్రివేది ఇప్పటికే తమ అభిప్రాయాలను పంచు.. తాజాగా విజయ్ ఏసుదాస్, యాజిన్ నిజార్ కూడా కీరవాణితో కలిసి పనిచేయడం గురించి స్పందించారు.