తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా తండ్రి మాటలే.. నా జీవితానికి బంగారు బాటలు' - ఎస్పీబాలు, ఏసుదాసు, లత సంగీత విభావరి

తన తండ్రి వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని, ఆయనలో దేవుడిని చూశానని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

'నా తండ్రి మాటలే.. నా జీవితానికి బంగారు బాటలు'

By

Published : Sep 24, 2019, 12:02 PM IST

Updated : Oct 1, 2019, 7:33 PM IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న కేజే ఏసుదాసు

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం, చిత్రతో కలిసి ఓ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రఖ్యాత గాయకులు కేజే ఏసుదాసు. ఈ సందర్భంగా ఆయన... తన సంగీత ప్రయాణం గురించి చెప్పారు.

" నేను చిన్నప్పటి నుంచి సంగీతాన్ని చాలా ఇష్టపడేవాడిని. ‘చదువులు గురించి మర్చిపో.. సంగీతం బాగా నేర్చుకో అని మా నాన్న నాకు చెప్పేవారు. ఆయన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. మా నాన్నలో నేను దేవుడిని చూశా. మా నాన్న ఒక డ్రామా ఆర్టిస్ట్‌, గాయకుడు. అయితే ఆయన సంగీతంలో ఎటువంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కానీ, నాకు మాత్రం సంగీతంలో శిక్షణ ఇప్పించి ఈ స్థాయిలో ఉండేలా చేశారు. నేను విశ్వవిద్యాలయంలో విద్వాన్‌ కోర్సులో శిక్షణ పొందాను. కానీ ఇప్పటికీ నేను ఓ విద్యార్థిగానే భావించుకుంటాను".
-- కేజే ఏసుదాసు, ప్రముఖ గాయకుడు

మొదటిసారి బాలు, చిత్రతో కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఏసుదాసు. నవంబర్ 30న ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగుతుందని తెలిపారు.

Last Updated : Oct 1, 2019, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details