భారీ బడ్జెట్ చిత్రంలో శింబు - kollywood
తమిళ నటుడు శింబు, యువ హీరో గౌతమ్ కార్తీక్ త్వరలో ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
మల్టీస్టారర్ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నర్తన్ దర్శకుడు. స్టూడియో గ్రీన్‌తో కలిసి శింబు తొలిసారి పనిచేస్తున్నాడు. శింబు 45వ సినిమాగా వస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కథానాయికలు, నటీనటుల వివరాలపై ఇంకా స్పష్టత లేదు. శింబు చివరగా ‘అత్తారింటికి దారేది’ రీమేక్ చిత్రం ‘వంత రాజవథాన్ వరువెన్’ మూవీలో నటించాడు. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబుకి జోడీగా మేఘా ఆకాశ్ , కేథరిన్ థెరిస్సా నటించారు.