తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైమా అవార్డ్స్​లో 'రంగస్థలం' ప్రభంజనం

ఖతార్​లో సైమా అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రామ్​చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' మొత్తంగా ఏడు పురస్కారాలు దక్కించుకుంది.

సైమా అవార్డ్స్​లో 'రంగస్థలం' ప్రభంజనం

By

Published : Aug 16, 2019, 2:35 PM IST

Updated : Sep 27, 2019, 4:47 AM IST

ఖతార్ రాజధాని దోహాలో జరుగుతున్న సైమా అవార్డ్స్​ వేడుకల్లో దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు సందడి చేశారు. మెగాస్టార్​ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే జాతీయ పురస్కారాల్లో సత్తా చాటిన​ 'మహానటి'..ఇందులోనూ మెరిసింది. రామ్​చరణ్ 'రంగస్థలం' మొత్తం ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.

  1. ఉత్తమ చిత్రం: మహానటి
  2. ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగ స్థలం)
    ఉత్తమ నటుడిగా రామ్​చరణ్
  3. ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)
    ఉత్తమ నటిగా కీర్తి సురేశ్
  4. ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగ స్థలం)
  5. ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)
  6. ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)
  7. ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)
    క్రిటిక్​ ఉత్తమ నటిగా సమంత
  8. ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)
  9. ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)
  10. ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)
  11. ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)
    ఉత్తమ సహాయ నటిగా అనసూయ
  12. ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)
  13. ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా)
  14. ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
  15. ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం- ఎంత సక్కగున్నావే)
  16. ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)
  17. ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)
  18. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)
  19. ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)
  20. పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ
    సైమా అవార్డును అందుకుంటున్న విజయ్ దేవరకొండ
Last Updated : Sep 27, 2019, 4:47 AM IST

ABOUT THE AUTHOR

...view details