అందం, చిలిపితనంతో ఆకట్టుకునే హీరోయిన్ శ్రుతిహాసన్.. తన డ్యాన్స్‌తో అందర్ని ఆకట్టుకుంది. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఇలా చేసింది. ఈ వేడుకలను తన స్నేహితుల మధ్య జరుపుకుంది. అనంతరం ఆ ఫన్నీ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.
"పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ ఫన్నీ డాన్స్ ఎంతగానో నచ్చింది. నాకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా ఆన్లైన్ కుటుంబానికి చాలా థ్యాంక్స్. నాకోసం ఓ వెబ్సైట్ ప్రారంభించి, విషెస్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. సన్నిహితులతో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో ఇంటికి వచ్చేస్తా."