అగ్ర కథానాయికలు వెబ్ సిరీస్‌లపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకమైన ప్రేక్షకులకు చేరువ కావడానికి అదొక మంచి వేదికగా నిలుస్తోంది. దాంతో మంచి కథ దొరకగానే, చేయడానికి పచ్చజెండా ఊపేస్తున్నారు. శ్రుతిహాసన్ ఇటీవల ఓ వెబ్ చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది.
శ్రుతి హాసన్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి - శ్రుతి హాసన్ తాజా వార్తలు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ నటించింది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది శ్రుతి హాసన్.
వెబ్ సిరీస్‌లో శ్రుతి హాసన్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ఇటీవలే పూర్తయింది. శ్రుతి హాసన్ ఇన్‌స్టా ద్వారా చిత్రీకరణ పూర్తయినట్టు పేర్కొంది. శ్రుతి తెలుగులో 'వకీల్‌సాబ్' సినిమాలోనూ నటించబోతోంది.