తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కార్తికేయ 2' లో నిఖిల్​ సరసన 'ఏజెంట్ స్నేహ'..! - shruthi sharma

'కార్తికేయ 2'లో శ్రుతి శర్మను హీరోయిన్​గా ఎంపిక చేసినట్లు సమాచారం. 'ఏజెంట్ సాయి శ్రీనివాస' ఆత్రేయలో నటనతో ఆకట్టుకుంది శ్రుతి.

శృతి

By

Published : Aug 23, 2019, 9:00 AM IST

Updated : Sep 27, 2019, 11:12 PM IST

నిఖిల్​, స్వాతి హీరో హీరోయిన్లుగా వచ్చిన 'కార్తికేయ' సినిమా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ఖరారు చేసింది చిత్రబృందం. ఈ మూవీలోనూ నిఖిల్​ హీరోగా నటిస్తుండగా కథానాయిక ఎవరనేది ఖరారు కాలేదు.

తాజాగా ఈ సినిమాలో శ్రుతి శర్మను హీరోయిన్​గా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో ఏజెంట్​ స్నేహ పాత్రలో ఆకట్టుకుంది శ్రుతి. ఈ చిత్రంలో నిఖిల్ సరసన జోడీగా ఎంపికైనట్లు సమాచారం.

ఇప్పటికే స్క్రిప్ట్​ వర్క్​ పూర్తి కాగా అక్టోబర్​ రెండో వారంలో షూటింగ్ ప్రారంభించనున్నారట. 'కార్తికేయ'కు దర్శకత్వం వహించిన చందు మొండేటినే సీక్వెల్​కూ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

ఇవీ చూడండి.. సిక్స్​ప్యాక్​ 'ఫైటర్'​గా విజయ్ దేవరకొండ

Last Updated : Sep 27, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details