బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందా? ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది. శ్రద్ధా, రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్ (shraddha kapoor and rohan shrestha) మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ ఇప్పటికే బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లపై శ్రద్ధా కానీ, ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా పేర్కొంటున్న రోహన్ కానీ.. ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీరి రిలేషన్‌పై శ్రద్ధా సన్నిహితులు హింట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇటీవల శ్రద్ధా కజిన్.. ప్రియాంక్ శర్మ చేసిన వ్యాఖ్యలతో శ్రద్ధా-రోహన్‌ల వివాహం గురించి చర్చ మరోసారి ఊపందుకుంది. శ్రద్ధా-రోహన్‌ల రిలేషన్ గురించి తనకు తెలియదని.. కానీ వారు వివాహం చేసుకుంటే చూడాలని ఉందన్నాడు. దీంతో వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని పుకార్లు పుట్టాయి.