లాక్డౌన్ తర్వాత ఒక్కొక్కటిగా సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2' కోసం హీరో యశ్.. సెట్లో అడుగుపెట్టారు. సముద్రం దగ్గర నిల్చుని ఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "అలలు ఆగవు. మనమే ఈదటం నేర్చుకోవాలి. చాలా విరామం తర్వాత సెట్స్‌లో రాఖీభాయ్" అనే వ్యాఖ్యను జోడించారు.
షూటింగ్ రీస్టార్ట్: బీచ్ దగ్గర రాఖీభాయ్.. పొలంలో శర్వానంద్ - rashmika karthi sulthan
చిత్రీకరణలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా హీరో యశ్, 'శ్రీకారం' టీమ్.. ఆ ఫొటోలు పోస్ట్ చేశారు. హీరోయిన్ రష్మిక.. 'సుల్తాన్' సినిమా అప్డేట్ను చెప్పింది.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'శ్రీకారం' చిత్రీకరణ తిరిగి ప్రారంభమైనట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయిక. కిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రేక్షకులు ముందుకు వచ్చే ఏడాది రానుందీ చిత్రం.
కార్తి, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన 'సుల్తాన్' షూటింగ్ గురువారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ రష్మిక ట్వీట్ చేసింది. తాను పనిచేసిన వాటిలో ఇది స్వీటెస్ట్ టీమ్ అని చెప్పింది. చిత్రీకరణ సమయంలో తనను భరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.