బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి మరో పోలీస్ సినిమా తీస్తున్నాడు. అక్షయ్ కుమార్‌తో తెరకెక్కిస్తున్న 'సూర్యవంశీ' షూటింగ్ ప్రారంభించాడు. సంబంధిత ఫొటోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్లో పంచుకున్నాడు.
ఇప్పటికే ఈ దర్శకుడు అజయ్ దేవ్‌గణ్‌తో 'సింగం సిరీస్', రణ్వీర్ సింగ్‌తో 'సింబా' వంటి పోలీస్ కథా నేపథ్యమున్న చిత్రాల్ని తెరకెక్కించాడు.