పర్వదిన వేడుకలో తారాగణం - shivaratri dance by filmstars
తమిళనాడులోని కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో రానా, కాజల్ అగర్వాల్, తమన్నా, అదితీరావ్ హైదరి సందడి చేశారు.
పర్వదిన వేడుకలో తారాగణం
శివరాత్రి పర్వదినం సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టాలీవుడ్ తారలు కాజల్ అగర్వాల్, తమన్నా, అదితీరావ్ హైదరిలతో పాటు హీరో రానా పాల్గొన్నారు. మహాశివరాత్రి విశిష్టత గురించి సద్గురు ప్రసంగించారు. అనంతరం జాగరణలో రాత్రంతా వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
- వేడుకకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం హాజరై...కొద్దిసేపు సద్గురుతో మాట్లాడారు. కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్, తమన్నా, వాసుదేవ్‌తో కలిసి నాట్యం చేశారు. ఈ వీడియోను కాజల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.