తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భర్త చెంప చెళ్లుమనిపించిన శిల్పాశెట్టి - shilpa shetty bites to her husband

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, భర్త రాజ్​ కుంద్రాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది. అందులో శిల్పా శెట్టి తన భర్తను చెంపదెబ్బ కొట్టింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా?

Shilpa Shetty slaps husband Raj Kundra in TikTok video but there's a catch
భర్త చెంప చెల్లుమనిపించిన శిల్పాశెట్టి

By

Published : Mar 18, 2020, 6:34 PM IST

Updated : Mar 18, 2020, 8:49 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. తన భర్త రాజ్​ కుంద్రాను చెంపదెబ్బ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? సామాజిక మాధ్యమం టిక్​టాక్​లో రాజ్​ కుంద్రా ఖాతా 3 నెలల్లోనే మిలియన్​ ఫాలోవర్లు అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఫన్నీ వీడియోతో తన సంతోషాన్ని ఇన్​స్టాలో పంచుకున్నాడు.

తాజా వీడియోలో ప్రముఖ హాస్యనటులు కపిల్ శర్మ, చందన్​ ప్రభాకర్​లతో ప్రారంభమవుతుంది. రాజ్​కుంద్రా 1 మిలియన్​ ఫాలోవర్లను పొందడంపై పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అలా రాజ్​ కుంద్రా ఫ్రేమ్​లోకి వచ్చి ఆనందంతో డ్యాన్స్​ చేస్తున్న సమయంలో.. అతని భార్య శిల్పాశెట్టి వచ్చి చెంపదెబ్బ కొడుతుంది. ఆ తర్వాత నవ్వూతూ భర్తను కౌగిలించుకొని అభినందనలు చెప్తుంది. ఈ వీడియోను రాజ్​ కుంద్రా తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసి.. ఫాలోవర్స్​ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా 2009లో వివాహం చేసుకున్నారు. శిల్పా.. ఇటీవల కుమార్తెకు జన్మనిచ్చింది. అంతేకాకుండా ఈ దంపతులకు 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.
Last Updated : Mar 18, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details