తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి అభిమానులకు శుభవార్త - శిల్పా శెట్టి

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తెరపై రీఎంట్రీ ఇవ్వనుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత 'నికమ్మా' సినిమాతో మళ్లీ ప్రేక్షకులను మెప్పించనుందీ పొడుగు కాళ్ల సుందరి.

శిల్పా శెట్టి

By

Published : Aug 1, 2019, 7:12 PM IST

హిందీ భామ శిల్పాశెట్టి దాదాపు 13 ఏళ్ల తర్వాత వెండితెరపై కనువిందు చేయనుంది. 'నికమ్మా' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2007లో 'అప్నే' సినిమాలో చివరిగా నటించిన ఈ అమ్మడు తర్వాత నటనకు విరామం పలికింది.

'నికమ్మా' చిత్రానికి సబీర్ ఖాన్ దర్శకుడు. 'మర్ద్​ కో దర్ద్​ నహీ​ హోతా' హీరో అభిమన్యు దశానీ శిల్పాకు జోడీగా నటించనున్నాడు. సోషల్​ మీడియా స్టార్​ షెర్లీ సెతియా కీలక పాత్ర పోషించనుంది.

శిల్పాశెట్టి

" వెండి తెరపై మరోసారి కనిపించేందుకు ఆతృతగా ఉన్నాను. దర్శకుడు సబీర్‌ ఖాన్​తో కలిసి ఈ కొత్త ప్రాజెక్టులో భాగమవడం సంతోషంగా ఉంది. ఇందులో నా పాత్ర చాలా నచ్చింది. ఈ చిత్రంలో అభిమానులు నన్ను కొత్తగా చూస్తారు".
-శిల్పా శెట్టి, హీరోయిన్

గతంలో 'హీరోపంతీ', 'భాగీ' సినిమాలను తెరకెక్కించాడు సబీర్​ ఖాన్. 'నికమ్మా' చిత్రాన్ని సోనీ పిక్చర్స్​, సబీర్ ఖాన్ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మించి... 2020లో విడుదల చేయనున్నారు.

ఇది సంగతి: వైవాహిక బంధానికి దియా గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details