బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య వైరం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇప్పటికే పలు వేదికలపై హృతిక్‌ను మాటలతో ఇబ్బంది పెట్టిన క్వీన్ .. ఇప్పుడు ప్రొఫెషనల్‌గానూ బాక్సాఫీస్ వద్ద యుద్ధం ప్రారంభించింది. జులై 26న హృతిక్ నటించిన 'సూపర్ 30' విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కంగనా నటించిన 'మెంటల్ హై క్యా' సినిమా కూడా అదే తేదీన వస్తుందని నిర్మాత ఏక్తాకపూర్ తెలిపింది.
కంగన 'మెంటల్' దెబ్బకు హృతిక్ వెనకడుగు - kangana ranout
హృతిక్ రోషన్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. కంగనా, రాజ్‌కుమార్ రావు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'మెంటల్ హై క్యా' అదే రోజున విడుదలవుతుండటం అందుకు కారణం.
ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటం పట్ల కంగనా స్పందించింది. హృతిక్‌ను టీజ్ చేస్తూ "మా సినిమా విడుదలవుతోంది. తను సినిమాను వాయిదా వేసుకోవడం గ్యారంటీ" అంటూ ఆట పట్టించింది. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న హృతిక్ "ఈ మెంటల్ టార్చర్‌ను నేను భరించలేను.. మీడియాకు ఆహారంగా మారలేను" అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశాడు.
త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపాడు హృతిక్. తన మనోవేదనను వ్యక్తం ఓ సందేశాన్ని పోస్ట్ చేయడం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. "మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా.. విడుదల తేదీ మార్చాలని నిర్మాతలను అభ్యర్థిస్తున్నా" అంటూ హృతిక్ తన బాధను వ్యక్తం చేశాడు.