'బాహుబలి'తో జాతీయ నటుడిగా ఎదిగిపోయాడు రానా దగ్గుబాటి. ఈ చిత్రం తర్వాత ప్రేక్షకులను అలరించటానికి కొత్త కథాంశాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటివరకు 'అరణ్య' సినిమాతో బిజీగా గడిపిన ఈ హీరో ప్రస్తుతం కొత్త కథలతో వీలైనంత తొందరగా మరో చిత్రాన్ని పూర్తిచేయాలనుకుంటున్నాడు.
తాజాగా రానా నటిస్తోన్న 'విరాటపర్వం' చిత్రీకరణ త్వరలోనే పూర్తికానుంది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతుందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లీడర్' చిత్రం బ్లాక్బస్టర్ అయింది.