తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా చిత్రాలకు తొలి విమర్శకురాలు రకుల్​ప్రీత్'​ - రకుల్​ప్రీత్​ సోదరుడు అమన్ సినిమా

నటుడిగా కెరీర్​ ప్రారంభానికి ముందు తన సోదరి, హీరోయిన్ రకుల్​ప్రీత్​ సింగ్​ తనకు కొన్ని నియమాలను పెట్టిందని అమన్​ అన్నాడు. తన చిత్రాలకు తొలి విమర్శకురాలు రకుల్​ అని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు.

She is first critic of my films, Says heroine Rakul preet's brother Aman
'నా చిత్రాలకు తొలి విమర్శకురాలు రకుల్​ప్రీత్'​

By

Published : Dec 30, 2020, 5:32 AM IST

టాలీవుడ్​లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్​ రకుల్​ప్రీత్ సింగ్ సోదరుడు అమన్​ సింగ్ తెలిపాడు. తెలుగు సినీపరిశ్రమలో నటుడిగా అడుగుపెట్టే ముందు తన సోదరి రకుల్.. కొన్ని నియమాలు పెట్టిందని అతడు తెలిపాడు. 'తెరవెనుక' చిత్రంతో టాలీవుడ్ లోకి అమన్​ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు.

ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో అమన్ ప్రీత్​ సింగ్​

ఐదేళ్ల ముందు నుంచే రంగస్థల కళాకారుడిగా శిక్షణ పొందినట్లు 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమన్​ వివరించాడు. ఇప్పటి వరకు హీరోగా మూడు సినిమాలు చేశానని, నిర్మాణాంతర కార్యక్రమాల వల్ల తొలి రెండు సినిమాల విడుదల ఆలస్యమైందని వెల్లడించాడు. తన సినిమాలకు తొలి విమర్శకురాలు రకుల్​ప్రీత్ ​సింగ్ అని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details