తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవన్నీ కల్పితాలే.. నమ్మకండి: షారుఖ్ - sharukh khan clarity on movies

'జీరో' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కట్టడం వల్ల షారుఖ్ ఖాన్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హిట్​ కొట్టడం కోసం షారుఖ్​ చాలా ప్రాజెక్టులు ఒప్పుకున్నట్లు సోషల్​ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వదంతులపై స్పందించాడు బాలీవుడ్​ బాద్​షా.

అవన్నీ కల్పితాలే.. నమ్మకండి: షారుఖ్

By

Published : Sep 9, 2019, 7:40 AM IST

Updated : Sep 29, 2019, 11:00 PM IST

అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న 'జీరో' చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల కాస్త విరామం తీసుకున్నాడు షారుఖ్​ ఖాన్​. అయితే ఈ స్టార్​ హీరో ప్రస్తుతం సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడని నెట్టింట పెద్ద చర్చ జరిగింది. తాజాగాబాలీవుడ్​ బాద్​షా​ షారుఖ్​ ఖాన్​ తర్వాత చేయబోయే సినిమాలపై స్పష్టతనిచ్చాడు. నకిలీ వార్తలను నమ్మొద్దని సోషల్​ మీడియా వేదికగా అభిమానులకు స్పష్టం చేశాడు షారుఖ్​.

" నేను చాలా సినిమాలు చేస్తున్నానని చాలా మంది రూమర్లు సృష్టిస్తున్నారు. బాయ్స్​ అండ్​ గర్ల్స్​ నేను సినిమా చేస్తే కచ్చితంగా దాని గురించి మీకు చెప్తాను. అలా చెప్పలేనివన్నీ కల్పితాలే."
- షారుఖ్​ ఖాన్​, సినీ నటుడు

ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్​ జాఫర్ 'ధూమ్​ 4' తెరకెక్కిస్తున్నాడని.. అందులో షారుఖ్ హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆనంద్​ ఎల్​ రాయ్​ తెరకెక్కిస్తోన్న ఓ సినిమా, సంజయ్​ లీలా భన్సాలీ తీస్తోన్న 'షాహిర్​ లుధియాన్వి' బయోపిక్​లోనూ షారుఖ్​ ఖాన్​ నటిస్తున్నాడని పుకార్లు వినిపించాయి. రాకేశ్​ శర్మ బయోపిక్​, ఫర్హాన్​ అక్తర్​ తీస్తోన్న 'డాన్​3'లో కింగ్​ఖాన్ ప్రధానపోత్ర పోషిస్తున్నట్లు గాసిప్స్ వినిపించాయి.​

ప్రస్తుతం ప్రముఖ స్ట్రీమింగ్​ సర్వీస్​ సంస్థ నెట్​ఫ్లిక్స్​తో కలిసి 'బార్డ్​ ఆఫ్​ బ్లడ్' అనే సిరీస్​ను నిర్మిస్తున్నాడు బాలీవుడ్​ బాద్​షా. ఇందులో ఇమ్రాన్​ హష్మి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. సొంత బ్యానర్​ రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్​మెంట్​ పతాకంపై నిర్మించిన ఈ సిరీస్​.. సెప్టెంబర్​ 27న మొబైల్​ తెరలపై సందడి చేయనుంది.

ఇవీ చూడండి...

Last Updated : Sep 29, 2019, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details