కరోనా కాస్త ఊపిరి పీల్చుకొనే అవకాశం ఇవ్వడం వల్ల అగ్ర హీరోలు వేగం పెంచారు. ఇటీవలే 'పఠాన్' చిత్రీకరణను మొదలు పెట్టిన షారుక్ ఖాన్(Sharukh Khan) మరో చిత్రం కోసం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరులో మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వలసల నేపథ్యంగా ఈ కథ సాగనుందట. ఇందులో నాయికగా తాప్సీని తీసుకోవాలని భావిస్తున్నారట హిరాణి. ఈ సినిమాతో పాటు షారుక్ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఓ చిత్రం కోసం పనిచేయనున్నారు.
'అంతిమ్'లో సల్మాన్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్(Salman Khan) కూడా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'అంతిమ్'. ఆయన బావమరిది ఆయుష్ శర్మ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.