తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షారుక్​-అట్లీ సినిమాపై క్లారిటీ.. టైటిల్ ఇదే! - షారుక్​ ఖాన్

Sharukh Khan Atlee movie: బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన జనవరి 26న ఇవ్వబోతున్నట్లు తెలిసింది. టైటిల్​ను కూడా అదే రోజు ప్రకటించనున్నారట!

sharukh
షారుక్​ అట్లీ

By

Published : Jan 15, 2022, 5:55 PM IST

Sharukh Khan Atlee movie: బాలీవుడ్​ హీరో షారుక్ ఖాన్, దర్శకుడు అట్లీ కాంబోలో సినిమా రూపొందనుందని చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. ఈ మూవీ గురించి ఎటువంటి అధికార ప్రకటన రాకపోయినప్పటికీ పలు రకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇప్పుడీ ఈ చిత్రం గురించి అధికార ప్రకటన జనవరి 26న ఇవ్వనున్నారని తెలిసింది. 'లయన్​' అనే టైటిల్​ను కూడా ఖరారు చేశారట!

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులతో చిత్రబృందం ఫుల్‌ బిజీగా ఉందట. చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును కూడా పూర్తి చేసుకున్నారట. అన్నీ సవ్యంగా జరిగితే జనవరి 26న అధికారంగా ప్రకటిస్తారు.

అట్లీ చిత్రాలను గమనిస్తే ఆయన తెరకెక్కించిన 'అదిరింది', 'విజిల్‌' సినిమాల్లో హీరో విజయ్‌ తండ్రీకొడుకులుగా, ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఇదే ఫార్ములాను షారుక్​ చిత్రంలోనూ అట్లీ రిపీట్​ చేయనున్నారని తెలిసింది. ఎన్‌.ఐ.ఏ. అధికారి, గ్యాంగ్‌స్టర్​గా డబుల్​ రోల్​లో బాద్​షా కనిపించనున్నారట. ఇందులో హీరోయిన్​గా నయనతార నటించనుంది.

ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పఠాన్‌'లో షారుక్ ఖాన్‌ నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా దీపికా పదుకొణె కనిపించనుండగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నారు. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నారు.

ఇదీ చూడండి: సంక్రాంతి స్పెషల్.. సినీ తారల ట్రెడిషనల్​ లుక్స్​!

ABOUT THE AUTHOR

...view details