మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు శంకర్(shankar ram charan film) కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ నెల 22న పుణెలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుం చెర్రీ, కియారాపై(ramcharan kiara movie) ఓ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ నవంబరు 2న పూర్తి అవుతుందని తెలిసింది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తారట.
ఈ చిత్రంలో విలన్‌గా మలయాళ నటుడు సురేష్ గోపి నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నరు. చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, శంకర్, రామ్‌చరణ్‌కు ఇది 15వ సినిమా కావడం విశేషం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా. పాన్ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ.170కోట్లతో నిర్మిస్తున్నారు(shankar ram charan movie budget)!