తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాప్​ సింగర్ షకీరాపై అడవి పందుల దాడి

అడవి పందులు తనపై దాడి చేశాయని తెలిపింది ఫేమస్​ పాప్ సింగర్ షకీరా. ఈ విషయం గురించి చెబుతూ మురికిగా, చిరిగిపోయిన తన బ్యాగ్​ను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది.

shakira attack news
షకీరాపై దాడి

By

Published : Oct 2, 2021, 5:28 PM IST

ఫేమస్​ పాప్​ సింగర్ షకీరాకు చేదు అనుభవం ఎదురైంది. తనపై రెండు అడవి పందులు దాడి చేశాయని షకీరా సోషల్ మీడియాలో తెలిపింది. ఈ విషయం గురించి చెబుతూ మురికిగా, చిరిగిపోయిన తన బ్యాగ్​ను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది.

చిరిగిపోయి, మురికిగా మారిన షకీరా బ్యాగ్​

కొడుకుతో కలిసి సేద తీరడానికి బార్సిలోనాలోని ఓ పార్క్​కు వెళ్లినప్పుడు రెండు అడవి పందులు దాడి చేశాయని షకీరా వెల్లడించింది. తన బ్యాగ్​ను నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లాయని, అందులోని వస్తువులను నాశనం చేశాయని తెలిపింది. దాడి అనంతరం దొరికిన తన బ్యాగ్​ను ఇన్​స్టాలో ఆమె పోస్ట్​ చేసింది. దాడిలో తమకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.

ఇదీ చదవండి:Gandhi Jayanti 2021: గాంధీపై వచ్చిన ఈ పాటలు చూసేయండి!

ABOUT THE AUTHOR

...view details