షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షా. ఈ హీరో సినిమా విడుదలవుతుంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అని చాలా చిత్రాలు నిరూపించాయి. అయితే షారుఖ్ నుంచి 'జీరో' చిత్రం తర్వాత మరో సినిమా గురించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అభిమానులందరూ షారుఖ్ పుట్టినరోజున తీపి కబురు చెప్తాడని ఆశించారు. కానీ, వారికి నిరాశే మిగిలింది.
నవ్వించే పోలీస్‌గా బాలీవుడ్ బాద్ షా..! - shah rukh khan new movie
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జీరో' తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ హీరో ఓ కొరియన్ రీమేక్‌లో నటించబోతున్నాడట.
షారుఖ్ నటించబోయే సినిమా ఇదేనంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా దీని గురించి మరో వార్త హిందీ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. షారుఖ్ ఒక కొరియన్ రీమేక్‌లో నటిస్తాడని సమాచారం. దీనికి 'జీరో' దర్శకుడు నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇది హాస్యభరితమైన కథ అని వినికిడి. ఇందులో అందర్ని నవ్వించే పోలీస్ పాత్రలో షారుఖ్ కనిపిస్తాడట. మరి ఈ కథైనా షారుఖ్ పట్టాలెక్కిస్తాడా, లేదా? అనే విషయం తెలియాలంటే మరి కొంత కాలం ఎదురుచూడాల్సిందే.
ఇవీ చూడండి.. పాట చిత్రీకరణలో 'ప్రతిరోజూ పండగే'