తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ప్రగతి

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి మరోసారి తన డ్యాన్స్​తో నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. దుమ్ముదులిపే స్టెప్పులతో అదరగొట్టింది.

By

Published : Apr 29, 2021, 10:08 PM IST

Pragathi
ప్రగతి

'ఎఫ్‌2' సినిమాలో తమన్నా, మెహ్రీన్​కు‌ తల్లిగా నటించింది సీనియర్ నటి ప్రగతి. 'ఓ బేబీ' చిత్రంలో లక్ష్మీ కోడలిగా, రావు రమేష్‌ భార్యగా కనిపించి అలరించింది. తెలుగు సినిమాల్లో అక్క, అమ్మ, ఆడపడచులాంటి పాత్రల్లో నటిస్తూ పేరుతెచ్చుకుంది. ప్రగతి ఎప్పటికప్పుడు తన నృత్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తుంటుంది. తాజాగా మరోసారి అదిరిపోయే డ్యాన్స్​తో ఆశ్చర్యపరిచింది.

గురువారం అంతర్జాతీయ డ్యాన్స్​ డే సందర్భంగా ఓ ఫేమస్ పాటకు కాలు కదిపింది ప్రగతి. తన స్నేహితురాలితో కలిసి అదిరిపోయే స్టెప్పులతో తన వయసు ఇంకా పదహారే అన్నట్లుగా దుమ్ముదులిపింది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేయగా.. అది కాస్తా వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details