తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెరపై తల్లి పాత్రలో.. ఇంట్లో మాస్​ స్టెప్పులతో!

వెండితెరపై తల్లి పాత్రలో తరచుగా కనిపిస్తుంటుంది నటి ప్రగతి. తనకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఈ నటి లుంగీ కట్టుకొని మాస్​ స్టెప్పులు వేసిన వీడియో ఇన్​స్టాలో షేర్​ చేసింది.

By

Published : Apr 13, 2020, 4:23 PM IST

Senior actress Pragathi grooves to Master's song-Video goes viral
తెరపై తల్లి పాత్రలో.. ఇంట్లో మాస్​ స్టెప్పులతో!

ఇళయ దళపతి విజయ్​ కొత్త సినిమా 'మాస్టర్​'లోని పాటకు మాస్​ స్టెప్పులేస్తూ అలరించింది నటి ప్రగతి. తన ఇన్​స్టా ఖతాలో పోస్ట్​ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. లుంగీ కట్టుకొని ఆమె వేసిన స్టెప్పులపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అందులో ప్రగతితో పాటు తన కుటుంబ సభ్యుడు ఒకరు కనిపించాడు.

సినిమాల్లో తల్లి పాత్రలో కనిపించే నటి ప్రగతి.. రియల్​ లైఫ్​స్టైల్​ మాత్రం వేరుగా ఉంటుంది. బయట ఆమె చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. తన జీవితంలో జరిగే తీపి జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. కొన్ని నెలలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఇదీ చూడండి.. మోదీ అంకుల్​ బయటకు వెళ్లొద్దన్నారు.. చిన్నారి ముద్దు మాటలు

ABOUT THE AUTHOR

...view details