హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సెహరి'. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టీజర్‌లో హర్ష్ డైలాగ్‌లు, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. అభినవ్, ప్రణీత్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలు. ప్రశాంత్ ఆర్.విహరి స్వరాలు అందిస్తున్నారు.
'సెహరి' టీజర్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్ - జాతిరత్నాలు వార్తలు
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'సెహరి' టీజర్‌తో పాటు 'జాతిరత్నాలు' చిత్రంలోని 'సిల్లీ ఫూల్స్' వీడియో సాంగ్ విడుదల అప్డేట్స్ ఇందులో ఉన్నాయి.
'సెహరి' టీజర్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'సిల్లీ పూల్స్' వీడియో సాంగ్‌ను శుక్రవారం (ఏప్రిల్ 16) సాయంత్రం 4.20 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇదీ చూడండి:రివ్యూ: 'ఆర్జీవీ దెయ్యం' భయపెట్టిందా?