బాలీవుడ్ నటి దీపికా పదుకొనే డీగ్లామర్ రోల్‌లో కనిపిస్తోన్న చిత్రం 'ఛపాక్'. విక్రాంత్ మాసే కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2005లో దిల్లీలో యాసిడ్ దాడికి గురైన అమ్మాయి లక్ష్మీ అగర్వాల్ పాత్రను.. మాలతీగా చూపించనున్నారు. 'రాజి' ఫేమ్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా, ఫాక్స్‌స్టార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీపిక 'ఛపాక్' తొలి షెడ్యూల్ పూర్తి
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటిస్తోన్న 'ఛపాక్' చిత్రం.. తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో దిల్లీలో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక కనిపించనుంది.
చెపాక్ తొలి షెడ్యూల్ పూర్తి
మార్చి 25న ఈ సినిమాలోని దీపికా ఫస్ట్ లుక్‌కు విడుదల చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న తరువాత నటిస్తోన్న చిత్రమిది. చివరిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'పద్మావత్' చిత్రంలో ఈ హీరోయిన్ కనిపించింది.